visakhapatanam: ఎయిరిండియా ప్రయాణికులకు చేదు అనుభవం... 180 మందిని విసిగించిన సిబ్బంది!
- ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
- బోర్డింగ్ పాస్ తీసుకుని పడిగాపులు
- 20 గంటల పాటు ప్రయాణికులను వెయిటింగులో పెట్టిన వైనం
విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు 180 మంది ప్రయాణికులు ఎయిరిండియా విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ టైముకే విమానం వచ్చింది. అయితే, విమానం టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్య ఉన్నట్టు పైలట్ గుర్తించాడు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
సాంకేతిక సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో పడ్డారు. అయితే బోర్డింగ్ పాస్ లు తీసుకుని విమానాశ్రయంలో ఎదురు చూస్తున్న ప్రయాణికులను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు సుమారు 20 గంటల పాటు ఎదురు చూసీచూసీ విసిగిపోయి సిబ్బందిని నిలదీసి, వాగ్వాదానికి దిగారు. దీంతో అర్ధరాత్రి 2 గంటలకు విమానం క్యాన్సిల్ అయిందని చెప్పారు. దీంతో ప్రయాణికులు సిబ్బందిపై మండిపడ్డారు.