Pakistan: దిగొచ్చిన పాకిస్థాన్.. కుల్‌భూషణ్ జాదవ్‌ను చూసేందుకు ఆయన భార్యకు అనుమతి
- గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైలులో కుల్‌భూషణ్ జాదవ్
- జాదవ్‌ను చూసేందుకు ఆయన భార్య దరఖాస్తు
- ఎట్టకేలకు అంగీకరిస్తూ వీసా మంజూరు చేసిన పాక్
గూఢచర్యం ఆరోపణలతో భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్.. జైలులో ఉంచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ న్యాయస్థానం 'మరణశిక్ష స్టే తీర్పు' ఇచ్చిన నేపథ్యంలో జైల్లో ఉన్న ఆయనను చూసేందుకు జాదవ్ భార్య దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు భారత హై కమిషన్ పాక్‌కు ఓ లేఖ పంపింది. దానికి స్పందించిన పాకిస్థాన్ అందుకు అంగీకరించింది.
మానవతా ధృక్పథంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. గతంలో ఆమె చేసిన దరఖాస్తులన్నింటినీ తిరస్కరించిన పాకిస్థాన్ ఈ సారి అందుకు భిన్నంగా ఆమెకు అనుమతి ఇస్తూ వీసా మంజూరు చేయడం విశేషం. అంతర్జాతీయ సమాజం నుంచి పాక్‌పై ఒత్తిళ్లు వస్తోన్న నేపథ్యంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు.