rajasekhar: మా అమ్మ ఫోన్ నెంబర్ చూస్తేనే నాకు ఏడుపొస్తోంది .. ఆమె లేదని తెలిసి కూడా ఫోన్ చేసేవాడిని!: రాజశేఖర్
- నేను ఓ డాక్టర్ ను .. ఎంతో అనుభవం వుంది
- అయినా అమ్మను కాపాడుకోలేకపోయాను
- అమ్మ దగ్గరికి వెళ్లిపోతానని జీవితను బెదిరించేవాడిని
- ఇప్పుడు ఆ అవకాశం లేదు
ఒక వైపున రాజశేఖర్ 'గరుడవేగ' సక్సెస్ కి ఆనందిస్తూనే .. మరో వైపున ఆయన తన తల్లిని అనుక్షణం తలచుకుంటున్నారు. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లోను .. తన తల్లితో తనకి గల అనుబంధాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. " ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెంటనే తనకి కాల్ చేయమని ఎంతోమందికి చెప్పే నేను, నా కళ్ల ముందే అమ్మ చనిపోతుంటే ఏమీ చేయలేకపోయాను. ఈ విషయంలో నేను ఫాస్టుగా రియాక్ట్ కాలేదేమోనని గిల్టీగా వుంది" అని అన్నారు.
"ఇక జీవితతో ఎప్పుడైనా గొడవపడితే .. అమ్మ దగ్గరికి వెళ్లిపోతాను అని బెదిరించేవాడిని. ఆ కోపం పోవడానికి అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతుండేవాడిని .. ఇక ఆ అవకాశం లేదు. ఇప్పుడు మా అమ్మ ఫోన్ నెంబర్ చూస్తేనే నాకు ఏడుపొస్తోంది. పిల్లలతో ఫోన్ చేయించేటప్పుడు అమ్మ నంబర్ నోటికి చెప్పేస్తుంటాను. అమ్మ లేదని తెలిసి కూడా ఆ నంబర్ కి ఫోన్ చేసేవాడిని. అందుబాటులో లేదని ఆన్సర్ వచ్చేది .. సిస్టర్ వాళ్లు స్విచ్ఛాఫ్ చేయడమో .. సిమ్ తీసేయడమో చేసుంటారు" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.