muslims: ముస్లిం బాడీగార్డులు తనకు వద్దని తెగేసి చెప్పిన పాక్ మంత్రి!
- ముస్లింలకు, అహ్మదీలకు మధ్య ఉన్న విభేదాలు చిన్నవే అనడం ఆయన చేసిన నేరం
- అహ్మదీలను ముస్లిమేతరులుగా భావించే పాక్ ముస్లింలు
- చంపుతామని ముస్లింల బెదిరింపులు
- ప్రస్తుతం క్రిస్టియన్ బాడీగార్డ్‌లను పెట్టుకున్న మంత్రి
ఓ పాకిస్థాన్ మంత్రి తనకు ముస్లిం బాడీగార్డులు వద్దని తెగేసి చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సదరు మంత్రి రానా సనావుల్లా మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. ముస్లింలకు, అహ్మదీల (అహ్మదీలను ముస్లిమేతరులుగా భావిస్తారు)కు మధ్య చిన్నపాటి విభేదాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు.
ఆయన మాట ముస్లిం మత పెద్దలకు నచ్చలేదు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక, ఇస్లామిస్ట్ గ్రూప్ తెహ్రీక్ లబాయిక్ యా రసూల్ అల్లా ఆందోళనలు నిర్వహించింది. బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన తానే సొంతంగా సెక్యూరిటీని నియమించుకుంటానని పోలీసులకు తెలిపారు. అంతవరకు మాత్రం క్రిస్టియన్ బాడీగార్డులను, ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు.