suresh raina: అద్భుతంగా రాణించిన రైనాను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకుంటుందా?

  • టీమిండియాలో అండర్ డాగ్ గా గుర్తింపు 
  • ఏ స్టార్ బౌలర్ కు లక్ష్యం కాని క్రికెటర్ 
  • మైదానంలో దిగుతూనే బౌలర్ తేరుకునేలోపు పని పూర్తి చేస్తాడు 

ఐపీఎల్ సీజన్ 11కు సిద్ధమవుతోంది. ఫిక్సింగ్ ఆరోపణలతో టోర్నీకి దూరమైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ ఐపీఎల్ లో పునరాగమనం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాలో చోటుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆటగాడు సురేష్ రైనాను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకోనుందంటూ ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఐపీఎల్ కొత్త నిబంధనల ప్రకారం పాత జట్లు ముగ్గురు ఆటగాళ్లను తమవద్ద ఉంచుకోవచ్చు. దీంతో ఇద్దరు స్వదేశీ ఆటగాళ్లుగా ధోనీతో పాటు లోకల్ ఆటగాడు అశ్విన్ ను చెన్నై సూపర్ కింగ్స్ తమతో ఉంచుకోనుంది. దీంతో సురేష్ రైనాను ఈ జట్టు వదులుకోనుంది.

 సురేష్ రైనా టీ20 ఫార్మాట్ లో అత్యంత విజయవంతమైన టీమిండియా ఆటగాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పొట్టి ఫార్మాట్ లో వేగంగా పరుగులు చేయడంలో రైనా దిట్ట. రైనాను అందరూ అండర్ డాగ్ గా పేర్కొంటారు. రైనా అద్భుతమైన ప్రతిభావంతుడనడంలో ఎలాంటి సందేహం లేనప్పటికీ.. కోహ్లీ, ధోనీలా ప్రత్యర్థులకు టార్గెట్ గా మారిన సందర్భాలు లేవు. భారత టాప్ ఆర్డర్ ను కూల్చాలని లక్ష్యం చేసుకునే ఏ ఆటగాడు రైనాను ఇంతవరకు లక్ష్యంగా చేసుకోలేదు. ఇదే రైనాకు బలం!

 దీనిని అనుకూలంగా మలచుకునే రైనా భారీ షాట్లతో అలరిస్తాడు. మైదానంలోకి వస్తూనే బౌలర్ తేరుకునేలోపు చేయాల్సిన నష్టం చేసేస్తాడు. దీంతో ఐపీఎల్ లో ఆడిన ప్రతి సీజన్ లోనూ 400 పైచిలుకు పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో అలాంటి ఆటగాడిని వదులుకుని చెన్నై సాహసం చేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో ను వదులుకుని అతని స్థానంలో సౌతాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ ను తీసుకోవాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News