Narendra Modi: పాప్యులారిటీలో తిరుగులేని మోదీ... సుదూరంగా ఉన్న రాహుల్ గాంధీ: ప్యూ తాజా సర్వే
- 88 శాతం మంది మద్దతు పొందిన మోదీ
- ఆయనకు సుదూరంగా 58 శాతం ఓట్లతో రాహుల్
- ఆ తరువాత సోనియాగాంధీ, కేజ్రీవాల్
- దక్షిణాదిన మోదీకి పెరిగిన మద్దతు
భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ తిరుగులేని పాప్యులారిటీతో కొనసాగుతున్నాడని 'ప్యూ రీసెర్చ్' నిర్వహించిన తాజా సర్వే పేర్కొంది. పాప్యులారిటీపై ర్యాంకులు ఇవ్వాలని కోరుతూ, 2,464 మంది భారతీయులను సర్వేలో భాగం చేశామని, మోదీని 88 పాయింట్లతో మంది సమర్థించగా, రాహుల్ గాంధీ ఆయనకు సుదూరంగా 58 పాయింట్లతో ఉన్నారు. ఇక రాహుల్ తరువాత సోనియా గాంధీ 57 పాయింట్లు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 39 పాయింట్లతో ఉన్నారని సర్వే తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తోందని సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో ఎనిమిది మంది అంగీకరించారని పేర్కొంది. 2014 ఎలక్షన్స్ సమయంతో పోలిస్తే, ఇప్పుడు పరిస్థితి బాగుందని చెప్పిన వారి సంఖ్య 19 శాతం అధికమని ప్యూ రీసెర్చ్ వెల్లడించింది. మొత్తం మీద ప్రతి పదిమందిలో ఏడుగురు దేశాభివృద్ధి, పాజిటివ్ సెంటిమెంట్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో 9 మంది మోదీ పట్ల సానుకూల ధోరణితో ఉన్నారని తెలిపింది. 2015 తరువాత ఉత్తరాదిలో మోదీ పాప్యులారిటీలో పెద్దగా మార్పు రాలేదని, పశ్చిమ రాష్ట్రాల్లో మాత్రం పెరిగిందని అన్నారు.