marriage: మరో మూడు నెలలపాటు వివాహాది శుభకార్యాలకు అడ్డు!
- ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు
- ఈ నెల 9 వరకు గురు మౌఢ్యమి (మూఢం)
- ఈ నెల 23, 24, 25 తేదీల్లో మాత్రం మంచి ముహూర్తాలు
- ఈ ముహూర్తాల్లో పెళ్లి చేసుకోకపోతే ఫిబ్రవరి 25 వరకు ఆగాల్సిందే
ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరుగుతాయన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది మాత్రం ఈ నెల 9 వరకు గురు మౌఢ్యమి (మూఢం) ఉండడంతో జంటలు పెళ్లిళ్లు చేసుకోలేదు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో మాత్రం మంచి ముహూర్తాలు ఉండడంతో ఆ మూడు రోజుల్లో ఏదైనా ఒక రోజు పెళ్లిళ్లు జరపడానికి యువతి, యువకుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ ముహూర్తాల్లో పెళ్లి జరిపించకపోతే మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్లీ 28 నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభం కానుంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో పురోహితులకు, పెళ్లి మండపాలు తయారు చేసే వారికి, ఫంక్షన్ హాళ్లకి డిమాండ్ పెరిగింది.