mahesh kathi: ప్రజాస్వామిక విలువలు లేని జ్యూరీ సభ్యులు: నంది అవార్డుల వివాదంపై మహేశ్ కత్తి
- రామ్ గోపాల్ వర్మ నంది అవార్డులపై చేసిన కామెంట్‌కి మహేశ్ కత్తి మద్దతు
- జ్యూరీ సభ్యులు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఎవరు నమ్మాలి?
- కులభూయిష్టమైన భావజాలం కలిగినవాళ్లు ప్రజాస్వామిక నిర్ణయం తీసుకోగలరా?
ఒక ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుందని, అలాగే తాను నంది అవార్డులు ఇచ్చిన వైనంపై స్పందించానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇలా అన్నందుకు తనను ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. అయితే, రామ్ గోపాల్ వర్మకు సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి మద్దతు తెలుపుతున్నట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
'ప్రజాస్వామిక విలువలు లేని జ్యూరీ సభ్యులు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఎవరు నమ్మాలి? ఫ్యూడల్, పితృస్వామిక, కులభూయిష్టమైన భావజాలం కలిగినవాళ్లు ప్రజాస్వామిక నిర్ణయం తీసుకోగలరా? అనే ఒక విజ్ఞత కలిగిన ప్రశ్న వర్మదీ.. దీనికి సమాధానం ఉందా?' అని సూటిగా ప్రశ్నించారు.