srinivas reddy: మా అమ్మ చాలా బాధ పడింది .. అందుకే పేకాట మానేశాను: శ్రీనివాస్ రెడ్డి
- పేకాట బాగా ఆడేవాడిని
- డబ్బులు కొంతవరకు పోయాయి
- అవకాశాల కోసం ప్రయత్నించలేదు
- సమయం వృథా అయింది
"గతంలో మీరు ప్లేయింగ్ కార్డ్స్ విపరీతంగా ఆడేవారట .. డబ్బులు కూడా బాగా పోగొట్టుకున్నారట .. నిజమేనా?" అనే ప్రశ్న తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డికి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. " విపరీతంగా ఏం కాదు గానీ .. పోగొట్టుకున్న మాట వాస్తవం. షూటింగ్ లేకపోతే నాకు ఏదీ గుర్తుకు వచ్చేది కాదు .. అవకాశాలు రావడం లేదేంటి? .. నా లైఫ్ ఏంటి అనే ఆలోచన ఉండేది కాదు .. పేకాట ఆడుతూ కూర్చునేవాడిని" అని అన్నారు
"ఎంతొచ్చింది .. ఎంతపోయింది అనేది ఎప్పుడూ నేను లెక్క వేయలేదు గానీ, చివరికి వచ్చేసరికి పేకాటలో మిగిలేది లాస్ అనే విషయాన్ని గ్రహించాను. ఎదుగుతున్న కొద్దీ ఈ వ్యసనం నుంచి బయటపడాలని భావించాను. అవకాశాల కోసం ప్రయత్నించకుండా సమయాన్ని వృథా చేస్తున్నాననే విషయం అర్థమైంది. ఇక నా సంగతి తెలిసి మా అమ్మ చాలా బాధపడింది. అంతే .. అప్పటి నుంచి పేకాట మానేశాను. పేకాట వైపు వెళ్లొద్దనేదే నేను అందరికీ చెప్పదలచుకున్న మాట" అని అన్నారు.