niti ayog: అందుకే హైదరాబాద్‌ను పారిశ్రామికవేత్తల సదస్సుకు ఎంపిక చేసుకున్నాం: నీతి అయోగ్ సీఈవో
- 5 రాష్ట్రాలు పోటీపడ్డాయి
- ఈ సదస్సుకు 127 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు
- తెలంగాణలో నిర్వహిస్తేనే బాగుంటుందని భావించి ఫైనల్ చేశాం
- హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి కలిగిన ప్రమాణాలు ఉన్నాయి
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహణకు 5 రాష్ట్రాలు పోటీ పడ్డాయని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ సదస్సుకు 127 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నట్లు చెప్పారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును చివరికి కర్ణాటక లేక తెలంగాణలో నిర్వహించాలని అనుకున్నామని తెలిపారు.
అందులో తెలంగాణలో నిర్వహిస్తేనే బాగుంటుందని భావించి హైదరాబాద్ ను ఫైనల్ చేశామని వివరించారు. హైదరాబాద్ టీ-హబ్ తో పాటు చాలా సంస్థలకు కేంద్రంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి కలిగిన ప్రమాణాలు ఉన్నాయని అన్నారు. అందుకే హైదరాబాద్‌ను పారిశ్రామికవేత్తల సదస్సుకు ఎంపిక చేసుకున్నామని చెప్పారు.