Vijayawada: విజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్టు!
- ఛలో అసెంబ్లీకి ప్రయత్నించిన ఏపీసీసీ నేతలు
- అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు
- నున్న, సింగ్ నగర్ పోలీస్స్టేషన్లకు కాంగ్రెస్ నేతల తరలింపు
ఛలో అసెంబ్లీకి ప్రయత్నించిన ఏపీసీసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఛలో అసెంబ్లీకి మద్దతు ప్రకటించిన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పిలుపు మేరకు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి కాంగ్రెస్ నాయకులు శాంతి ర్యాలీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఛలో అసెంబ్లీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ నాయకులు చల్లపల్లి బంగ్లా ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి.. నున్న, సింగ్ నగర్ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించింది కాంగ్రెస్ అని, దాన్ని సాధించేది కూడా కాంగ్రెసేనని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.