flight: రోడ్డుపక్కనే కుప్పకూలిపోయిన చిన్నపాటి విమానం.. మీరూ చూడండి!
- ఫ్లోరిడాలో జాతీయ రహదారిపై ఘటన
- రాక్వెల్ అంతర్జాతీయ ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన ఒకే ఇంజిన్ కలిగిన విమానం
- విమానంలోని ఇద్దరికి స్వల్పగాయాలు
ఒక చిన్న విమానం రహదారి పక్కనే కుప్పకూలిపోయిన ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. అక్కడి జాతీయ రహదారిపై అతి తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఆ ఫ్లైట్ ప్రయాణించింది. పైలట్ కావాలనే ఇలా తక్కువ ఎత్తులో దాన్ని తీసుకొచ్చాడని అందరూ భావించారు. కానీ, అది కొద్దిసేపటికే రోడ్డుపక్కనే కుప్పకూలింది. రెక్కలు రోడ్డు పక్కన ఉన్న చెట్టు కొమ్మలను ఢీకొన్నాయి.
రాక్వెల్ అంతర్జాతీయ ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన ఒకే ఇంజిన్ కలిగిన ఈ చిన్న విమానం క్లియర్‌వాటర్ ఎయిర్‌పార్క్ నుంచి బయలుదేరగా గమ్యస్థానం మరో రెండు కి.మీ దూరం ఉందనగా, విమాన ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ విమానంలో పైలట్‌తో పాటు ఓ ప్రయాణికుడు మాత్రమే ఉన్నారు. ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి...