Hyderabad: ఫోన్లో తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు హైదరాబాద్ యువతి ఫిర్యాదు
- తలాక్‌పై సుప్రీంకోర్టు నిషేధం విధించినప్పటికీ ఆగని దురాచారం
- పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే దుబాయ్ వెళ్లిన భర్త
- దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇచ్చే ముస్లింల పద్ధతి సరైంది కాదంటూ సుప్రీంకోర్టు ఆ విధానాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికీ కొందరు తమ భార్యలకు తలాక్ చెబుతున్నారు. తనకు తన భర్త తలాక్ చెప్పాడని హైదరాబాద్‌లో ఓ ముస్లిం యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే, అథియా బేగం అనే ముస్లిం యువతికి షేక్ సర్దార్ మజర్‌తో ఈ ఏడాది అక్టోబర్ 18న పెళ్లి జరిగింది. అనంతరం సదరు భర్త దుబాయ్ వెళ్లిపోయాడు. ఈ నెల 13న అథియా బేగంకి ఫోన్ చేసి తలాఖ్ చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.