ayodhya: వివాదం పరిష్కారం దిశగా మరో ముందడుగు: అయోధ్యలో రామాలయం.. లక్నోలో మసీదు!
- పరిష్కారాన్ని కోరుతూ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో దరఖాస్తు
- ఒకే అభిప్రాయానికి వచ్చిన షియా వక్ఫ్ బోర్డు, హిందూ సంస్థలు
- అయోధ్యలో రామాలయం.. లక్నోలో మసీదు
- ఇక నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీంకోర్టే
అయోధ్యలో రామమందిరం వివాదంపై పరిష్కారం దిశగా చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ అంశంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. పరిష్కారాన్ని కోరుతూ ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసింది. షియా వక్ఫ్ బోర్డు, హిందూ సంస్థలు ప్రస్తుతం ఒకే అభిప్రాయానికి వచ్చాయని షియా బోర్డ్ చైర్మన్ సయీద్ వసీం రిజ్వి అన్నారు.
ఈ విషయంపై తదుపరి నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీంకోర్టేనని చెప్పారు. అయోధ్య వివాదాస్పద స్థలంలో రామాలయం, లక్నోలో మసీదు నిర్మించాలని షియా వక్ఫ్ బోర్డు ప్రతిపాదించినట్లు తెలిపారు. మసీదు కోసం ఘంటాఘర్ సమీపంలో భూమి ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.