kvp ramchander: పోల‌వ‌రం ప్రాజెక్టుపై హైకోర్టులో కేవీపీ పిటిష‌న్!

  • నిర్మాణ వ్యయాన్ని మొత్తం కేంద్ర‌ ప్ర‌భుత్వ‌మే భరించేలా ఆదేశించాలి
  • పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందు ప‌ర్చిన విధంగానే వ్యవహరించాలి-కేవీపీ
  • పిటిష‌న్ స్వీక‌రించిన న్యాయ‌స్థానం
  • 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచన‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్మిస్తోన్న‌ పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ప్రాజెక్ట్ ఖ‌ర్చుపై ఏపీ ప్ర‌భుత్వం చెబుతున్న మాటలు పొంత‌న లేకుండా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్ర‌భుత్వ‌మే భరించేలా ఆదేశించాలని కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుప‌ర్చిన విధంగానే వ్యవహరించేలా కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించాల‌ని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ స‌ర్కారు ఖర్చు చేసిన 3800 కోట్ల మొత్తాన్ని కేంద్ర ప్ర‌భుత్వం వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశించాల్సిందిగా కోర్టును కోరారు. ఈ పిటిష‌న్‌ను విచారించిన ధర్మాసనం పోలవరంపై తమ వైఖరి చెప్పాలని కేంద్ర స‌ర్కారుకి ఆదేశాలు జారీచేసి, నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. 

  • Loading...

More Telugu News