jagannadha rasagulla: 'జగన్నాథ రసగుల్లా'కు భౌగోళిక గుర్తింపు కోరనున్న ఒడిశా!
- స్పష్టం చేసిన రాష్ట్రమంత్రి ప్రఫుల్ల సమాల్
- రసగుల్లా మూలాల విషయంలో ఎదురుదెబ్బ తిన్న ఒడిశా
- మరో పేరుతో భౌగోళిక గుర్తింపునకు దరఖాస్తు
ఇటీవల రసగుల్లా భౌగోళిక గుర్తింపు విషయంలో పశ్చిమ బెంగాల్‌తో వివాదంలో చుక్కెదురు కావడంతో మరో పేరుతో రసగుల్లాకు భౌగోళిక గుర్తింపు తెచ్చుకునేందుకు ఒడిశా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రసగుల్లాకు 'ఒడిశార రసగుల్లా' అని కాకుండా 'జగన్నాథ రసగుల్లా' అని పేరు పెట్టి భౌగోళిక గుర్తింపునకు దరఖాస్తు చేయబోతున్నట్టు ఒడిశా మంత్రి ప్రఫుల్ల సమాల్ వెల్లడించారు.
రసగుల్లా మూలాలు తమ రాష్ట్రానికి చెందినవే అంటూ ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు గత రెండున్నరేళ్లుగా పెట్టుకున్న వివాదానికి తెరదీస్తూ చెన్నైలోని భౌగోళిక గుర్తింపు సంస్థ.. రసగుల్లా మొదట బెంగాల్‌లోనే తయారైందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.