namita: సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నమిత వివాహం.. శరత్ కుమార్ హాజరు!

  • 'సొంతం' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నమిత
  • 'జెమిని', 'బిల్లా' వంటి సినిమాలతో తెలుగులో ఆదరణ
  • తమిళంలో వరుస అవకాశాలతో స్టార్ హోదా
  • తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ లో వివాహం

ప్రముఖ సినీ నటి నమిత వివాహం తిరుపతిలో జరిగింది. పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్ లో నమిత-వీరేన్ చౌదరిల వివాహం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వివాహానికి టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శరత్ కుమార్, రాధిక దంపతులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.

గతంలో శరత్ కుమార్ తో నమితను లింక్ చేస్తూ పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. కాగా, 'సొంతం' సినిమాతో 2002 సంవత్సరంలో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నమిత, ఆ తర్వాత కోలీవుడ్ కు వెళ్లి అక్కడ విజయవంతమైంది. వరుసగా సినిమాలు చేస్తూ విశేషమైన అభిమానుల్ని సొంతం చేసుకుంది.  

  • Loading...

More Telugu News