terrorist: హఫీజ్ సయీద్‌ను విడిచిపెట్టడంపై పాక్‌ను తప్పుబట్టిన అమెరికా!
- 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్
- గృహ నిర్బంధం నుంచి బయటకు రాగానే కశ్మీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు
- హఫీజ్ సయీద్‌పై కేసు నమోదు చేయాలి
- అరెస్టు చేయాలి- అమెరికా
పాకిస్థాన్ తీరును అమెరికా మరోసారి తప్పుబట్టింది. 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌ను కొన్ని రోజులు గృహ నిర్బంధంలో ఉంచిన పాకిస్థాన్ తాజాగా కోర్టు తీర్పుతో అతనిని మళ్లీ విడుదల చేసిన విషయం తెలిసిందే. పాక్ ప్రభుత్వం సరైన సాక్ష్యాధారాలను సమర్పించకపోవడంతో అక్కడి కోర్టు తాజాగా అతని నిర్బంధాన్ని పొడిగించడానికి అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో ఈ విషయంపై అమెరికా స్పందిస్తూ, భారత్‌పై యుద్ధం ప్రకటించిన అతనిని తిరిగి అరెస్టు చేయాలని, కేసు నమోదు చేయాలని పాక్‌కు సూచించింది. మరోపక్క, గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన హఫీజ్ సయీద్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్‌లోని కశ్మీరుకు స్వాతంత్ర్యం తీసుకొస్తానని అన్నాడు.