Narendra Modi: నరేంద్ర భాయ్.. అర్జెంట్‌గా మరిన్ని ఆలింగనాలు కావాలి: రాహుల్ గాంధీ
- మరోసారి మోదీకి చురకలంటించిన రాహుల్
- నిర్బంధంలో ఉన్న హఫీద్ సయీద్ విడుదలయ్యాడు
- మరోసారి మోదీ ఆలింగనం చేసుకోవాలి
గృహ నిర్బంధంలో ఉన్న 26/11 ముంబయి ఉగ్రదాడి సూత్రధారి, ఉగ్రవాదసంస్థ జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్‌ని పాకిస్థాన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. గతంలో మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలింగనం చేసుకున్న విషయంపై రాహుల్ గాంధీ చురకలంటించిన విషయం తెలిసిందే. పాక్‌తో సత్సంబంధాలు మరింత బలపర్చుకుంటున్నామంటూ అప్పట్లో ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో రాహుల్ స్పందిస్తూ, 'మోదీ, మరోసారి ట్రంప్‌ని కౌగిలించుకోండి' అన్నారు.
తాజాగా హఫీద్ సయీద్ విడుదలైన నేపథ్యంలో తొందరగా మరిన్ని ఆలింగనాలు కావాలంటూ రాహుల్ సెటైర్ వేశారు. 'నరేంద్ర భాయ్.. మాటలు కాదు, చేతలు కావాలి' అని రాహుల్ గాంధీ పేర్కొన్నాడు. హఫీద్ సయీద్ బయటకొచ్చాడని, మోదీ చేసిన ఆలింగనాల ప్రక్రియ విఫలమైందని, ఇప్పుడు మరిన్ని ఆలింగనాలు కావాలని ఆయన చురకలంటించారు.