hindu: ఒక్కో హిందువు నలుగురు పిల్లలను కనాలి.. మన జనాభా పెంచాలి: హరిద్వార్ పీఠాధిపతి
- కర్ణాటకలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ సన్సద్
- పాల్గొన్న హిందూ సంఘాల పెద్దలు
- జనాభాను సమతుల్యంగా ఉంచాలి- హరిద్వార్ పీఠాధిపతి
- హిందూ జనాభా తగ్గిన ప్రాంతాలను భారత్ కోల్పోయింది
ఇద్దరు పిల్లల విధానం వల్ల భారత్‌లో హిందువుల జనాభా తగ్గుతోందని హరిద్వార్ పీఠాధిపతి స్వామీ గోవింద్‌దేవ్ గిరిరాజ్ మహరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని ఉడిపి క్షేత్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ధర్మ సన్సద్ లో పాల్గొన్న సదరు పీఠాధిపతి మాట్లాడుతూ... దేశంలో ఎక్కడెక్కడ హిందువుల జనాభా తగ్గిందో ఆ ప్రాంతాన్ని భారత్ కోల్పోయిందని అన్నారు.
ఒక్కో హిందువు నలుగురు పిల్లలను కనాలని, దేశంలో కామన్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చే వరకు దీన్ని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. అలా చేస్తేనే జనాభాను సమతుల్యంగా ఉంచవచ్చని తెలిపారు. ధర్మ సన్సద్ లో ముఖ్యంగా అయోధ్యలో రామాలయం, గోరక్ష, హిందూ ధర్మం అంశాలపై చర్చించారు.