Cricket: మూడో రోజు ముగిసిన ఆట‌: శ్రీలంక 21/1

  • రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 21/1
  • శ్రీలంక బౌల‌ర్‌ పెరెరాకు 3 వికెట్లు
  • ఇప్ప‌టికి 384 ప‌రుగులు వెనుకంజ‌లో శ్రీలంక‌
  • శ్రీలంక మొద‌టి ఇన్నింగ్స్-205, భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్ 610

నాగ్‌పూర్‌లో జ‌రుగుతోన్న శ్రీలంక-భార‌త్ టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. శ్రీలంక మొద‌టి ఇన్నింగ్స్‌లో 205 ప‌రుగులు చేసి ఆలౌటైన విష‌యం తెలిసిందే. 610/6 స్కోరు వ‌ద్ద‌ మొద‌టి ఇన్నింగ్స్‌ను భార‌త్‌ డిక్లేర్ చేసిన అనంత‌రం బ్యాటింగ్ మొద‌లు పెట్టిన శ్రీలంకకు ఆదిలోనే తొలిదెబ్బ త‌గిలింది. రెండు బంతులు ఆడిన స‌మ‌ర‌విక్ర‌మ ఇషాంత్ శ‌ర్మ బౌలింగ్‌లో డ‌కౌట్ అయ్యాడు.

క్రీజులో క‌రుణ‌ర‌త్నే 11, లాహిరు తిరిమ‌న్నే 9 ప‌రుగుల‌తో ఉన్నారు. ఇప్ప‌టికి శ్రీలంక 384 ప‌రుగులు వెనుకంజ‌లో ఉంది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ (213) , రోహిత్ శ‌ర్మ‌(102 నాటౌట్‌), ముర‌ళీ విజ‌య్ (128),  చ‌టేశ్వ‌ర్ పుజారా (143), లోకేశ్ రాహుల్ (7), ర‌హానె (2), ర‌విచంద్ర‌న్ అశ్విన్ (5), వృద్ధిమాన్ సాహా 1 (నాటౌట్‌) ప‌రుగులు చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బౌల‌ర్ల‌లో గామేజ్, హెర‌త్‌, ష‌న‌క ఒక్కో వికెట్ తీయ‌గా, పెరెరాల‌కు మూడు వికెట్లు ల‌భించాయి. ఆట ముగిసే స‌మ‌యానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్టానికి శ్రీలంక 21/1 ప‌రుగులతో ఉంది.

  • Loading...

More Telugu News