love zihad: సుప్రీంలో కేరళ 'లవ్ జీహాద్' కేసు కొత్త మలుపు!

  • నీకేం కావాలని ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం 
  • స్వేచ్ఛ కావాలన్న బాధితురాలు
  • ఆమె భవిష్యత్తును చూడాలని కాలేజీ డీన్ కు ఆదేశం 

దేశవ్యాప్తంగా కలకలం రేపిన కేరళ 'లవ్ జీహాద్' కేసు సుప్రీంకోర్టులో సంచలన మలుపు తీసుకుంది. అఖిల అశోకన్ అనే అమ్మాయి ఇస్లాం స్వీకరించి, హదియగా మారి ముస్లిం యువకుడు షఫీన్‌ జహాన్‌ ను గత డిసెంబర్ లో పెళ్లాడింది. దీంతో, తన కుమార్తెను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతమార్పిడి చేశారంటూ ఆమె తండ్రి పెట్టిన 'లవ్ జీహాద్' కేసును సమర్థిస్తూ వారి వివాహాన్ని కేరళ హైకోర్టు కోర్టు కొట్టివేసింది. దీనిపై హదియ వేసిన పిటిషన్ ను ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.

ఈ సందర్భంగా ఆమెను "నీకేం కావాలి?" అని కోర్టు ప్రశ్నించింది. దానికామె 'స్వేచ్ఛ కావాల'ని సమాధానం చెప్పింది. మెడిసిన్ పూర్తి చేసి, డాక్టర్ని కావాలనుకుంటున్నట్టు తెలిపింది. దీంతో ఈ అసాధారణ కేసులో ఆమె వాంగ్మూలంపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని చెబుతూ, ఆమె తన చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడు సేలంలోని హోమియోపతి కళాశాల డీన్‌ ను ఆమెకు గార్డియన్‌ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు ఈ కేసు విచారణ సందర్భంగా హదియ వాంగ్మూలం సేకరించవద్దని, ఆమెను భర్త హిప్నటైజ్‌ చేశారని, ఆమె మాటలు నమ్మవద్దని ఎన్‌ఐఏ వాదించింది. అయితే ఆ వాదనలను హదియ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఖండించారు.

  • Loading...

More Telugu News