v6: ఆసుపత్రి నుంచి వీ6 'బిత్తిరి సత్తి' డిశ్చార్జ్.. దాడిని ఖండించిన పొన్నాల లక్ష్మయ్య, అల్లం నారాయణ
- దుండగుడి దాడిలో బిత్తిరి సత్తి ముఖంపై గాయాలు
- బిత్తిరి సత్తికి చికిత్స అందించిన స్టార్ ఆసుపత్రి వైద్యులు
- దాడి చేసిన వ్యక్తి మతిస్థిమితం లేనివాడిలా మాట్లాడుతున్నాడు-అల్లం నారాయణ
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ వీ6లో 'తీన్మార్' వార్తలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న బిత్తిరి సత్తిపై మణికంఠ అనే ఓ వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. అతనికి చికిత్స అందించిన స్టార్ ఆసుపత్రి వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. అతని ముఖం, చెవికి గాయాలయ్యాయని తెలిపారు. కాగా, బాధితుడు బిత్తిరి సత్తిని ఆసుపత్రి వద్ద కాంగ్రెస్నేత పొన్నాల లక్ష్మయ్య పరామర్శించారు. ఆయనపై జరిపిన దాడిని ఖండించారు.
వైద్యులను అడిగి అతని ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు.
ఈ దాడిని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ కూడా ఖండించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడిచేసిన వ్యక్తి మూర్ఖుడిలా ఉన్నాడని, మతిస్థిమితం లేనివాడిలా మాట్లాడుతున్నాడని చెప్పారు. సత్తి తెలంగాణ భాషలో మాట్లాడుతూ ఆ యాసకే వన్నె తెచ్చారని, మరోవైపు మణికంఠ మాత్రం బిత్తిరి సత్తి భాషను అవమానిస్తున్నందుకు దాడి చేశానని అసంబద్ధ కారణం చెబుతున్నాడని అన్నారు.