pule: మొట్టమొదటి టీచర్‌గా తన భార్యను తీర్చిదిద్దిన మహనీయుడు జ్యోతిరావు పూలే: ఏపీసీసీ ఘననివాళి
- ఏపీసీసీ కార్యాలయంలో మహాత్మ పూలే 127వ వర్థంతి కార్యక్రమం
- బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించారు-ఏపీసీసీ
- అమరావతిలో 150 అడుగుల పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.జె.రత్నకుమార్ అన్నారు. విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో మహాత్మ పూలే 127వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రోజుల్లోనే విద్యకు ఎంత విలువ ఉండాలో, విద్య వల్ల దేశం ఎంత ప్రగతి సాధిస్తుందో చెప్పిన వ్యక్తి పూలే అని ఏపీసీపీ నేతలు కొనియాడారు.
ఎన్నో కష్టాలను ఎదుర్కుని, తన భార్యకు కూడా విద్య నేర్పి, దేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్‌గా ఆమెను తీర్చిదిద్దిన ఘనత కూడా ఆయనదేనని అన్నారు. అమరావతిలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.