sushma swaraj: తెలంగాణకు 'చిన్నమ్మ'ని అంటూ ఆకట్టుకున్న సుష్మా స్వరాజ్!

  • తెలంగాణ వాసులను అలరించిన సుష్మ ప్రసంగం
  •  తెలంగాణ చిన్నమ్మననగానే సభలో కేరింతలు 
  • ఇవాంక నుంచి అంతా ప్రేరణ పొందుతారు 

హెచ్ఐసీసీలో జరిగిన జీఈ సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తన పలకరింపుతో తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకున్నారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ, సంప్రదాయం, ఆధునికీకరణ మేళవించిన తెలంగాణ ప్రజలకు తాను చిన్నమ్మనని పేర్కొన్నారు. దీంతో సభాప్రాంగణం కేరింతలతో మార్మోగిపోయింది.

తరువాత ఆమె ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్‌- అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయనడంలో తనకెలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. ఈ ప్రఖ్యాత సదస్సుకు అతిథిగా విచ్చేసిన ఇవాంకకు ధన్యవాదాలన్నారు. నేటి యువత శక్తియుక్తులకు ఆమెను ఓ ప్రతినిధిగా సుష్మా అభివర్ణించారు. ఇవాంక నుంచి భారత్‌, ప్రపంచ మహిళా పారిశ్రామికవేత్తలు ప్రేరణ పొందుతారని అన్నారు. 

  • Loading...

More Telugu News