Hyderabad: అనూహ్య స్పంద‌న... ఈ రోజు ల‌క్ష మంది ప్ర‌యాణించే అవ‌కాశం!: హైద‌రాబాద్ మెట్రోరైల్ ఎండీ

  • భార‌త ప్ర‌భుత్వమే మెట్రోరైల్‌ టికెట్ ధరలను నిర్ణయిస్తుంది
  • సెంట్రల్ మెట్రో యాక్ట్ కిందే ధ‌ర‌లు
  • త్వరలోనే మెట్రో పాసులు అందుబాటులోకి
  • సరదాగా ప్రయాణించాలనుకున్న వారే ఇరవై శాతం వరకు ఉన్నారు

హైద‌రాబాద్ మెట్రో రైల్ సేవ‌లు ఈ రోజు ఉద‌యం నుంచి అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మొద‌టి రోజు అనూహ్య‌ స్పందన వచ్చిందని తెలిపారు. ఈ రోజు రాత్రి వ‌ర‌కు మొత్తం లక్ష మంది ప్రయాణించే అవకాశం ఉందని, సరదాగా ప్రయాణించాలనుకున్న వారే ఇరవై శాతం వరకు ఉన్నార‌ని చెప్పారు. మెట్రోరైల్ విష‌యంలో మ‌రిన్ని సాంకేతిక పనులు జ‌ర‌గాల్సి ఉన్నాయని చెప్పారు.

హైదరాబాదు ప్రజలు పూర్తి భద్రతతో మెట్రో ప్రయాణాలు చేయవచ్చని మెట్రోరైల్ ఎండీ తెలిపారు. మెట్రో పాసులను త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకురావ‌చ్చ‌ని తెలిపారు. పార్కింగ్ పనులు నెల‌రోజుల్లో పూర్తవుతాయ‌ని చెప్పారు. సెంట్రల్ మెట్రో యాక్ట్ కింద భార‌త ప్ర‌భుత్వం మెట్రోరైల్‌ టికెట్ ధరలను నిర్ణయిస్తుందని తెలిపారు.        

  • Loading...

More Telugu News