Hyderabad: హైదరాబాదీలు నచ్చారు... బిర్యానీ అదుర్స్: అతిథులు

  • హైదరాబాదీలు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు
  • హైదరాబాదు సంస్కృతి గురించి తెలుసుకున్నాం
  • విందు బాగుంది...బిర్యానీ నచ్చింది
హెచ్ఐసీసీలోని జీఈఎస్-2017లో పాల్గొనేందుకు వచ్చిన అతిథులు తమకు హైదరాబాదీలు బాగా నచ్చారని చెప్పారు. సదస్సులో పాల్గొన్న హైదరాబాదీలతో మాట్లాడామని, వారంతా చాలా ఫ్రెండ్లీగా కనిపించారని పేర్కొన్నారు. ఇక్కడి సంస్కృతి గురించి తెలుసుకున్నామని చెప్పారు. రెండు రోజులపాటు ఇచ్చిన విందు బాగుందని వారు తెలిపారు.

ప్రధానంగా హైదరాబాదు బిర్యానీ చాలా బాగుందని వారు కితాబిచ్చారు. సదస్సులో అతిథి మర్యాదలు కూడా చాలా బాగున్నాయని అన్నారు. హైదరాబాదు నగరం చాలా బాగుందని కితాబునిచ్చారు. ఈ సదస్సుకు హాజరవ్వడం ఆనందం కలిగించిందని చెప్పారు. సదస్సులో పాల్గొనడం ద్వారా ఇతరులతో తమ ఆలోచనలు పంచుకోవడం, వినూత్న అవకాశాలు కలగడం జరిగిందని పలువురు అభిప్రాయపడ్డారు. 
Hyderabad
GES-2017
GES-2017 delegates
delegates Dinner

More Telugu News