gst: మళ్లీ పుంజుకున్న జీడీపీ.. తొలగిపోతోన్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు!
- 2017-18 తొలి త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన జీడీపీ
- జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో మాత్రం 6.3 శాతంగా నమోదు
- ముఖ్యంగా నిర్మాణ రంగం వృద్ధి
జీడీపీ వృద్ధి రేటు ఈ త్రైమాసికంలో మళ్లీ పెరిగింది. 2017-18 తొలి త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయి 5.7 శాతంగా నమోదైన జీడీపీ, జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం నమోదు చేసింది. అయితే, గత ఏడాది ఇదే త్రైమాసికంలో మాత్రం 7.5 శాతంగా నమోదైంది. తయారీ రంగం, విద్యుత్, గ్యాస్, మంచినీటి సరఫరా, ట్రేడ్, హోటల్స్, రవాణా, సేవల రంగాల్లో ఈ త్రైమాసికంలో వృద్ధిరేటు పెరిగిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఈ త్రైమాసికంలో ముఖ్యంగా నిర్మాణ రంగం వృద్ధి చెందడం వల్ల జీడీపీ వృద్ధిరేటు ఇంతగా నమోదైందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు తొలగిపోతున్నాయని ఆయన వివరించారు.