abboori ravi: అమ్మానాన్నలతో మాట్లాడకపోతే ఆ రోజు నాకు నిద్ర పట్టదు: సినీ రచయిత అబ్బూరి రవి
- ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తాను
- అమ్మానాన్నలతో గడపడం ఓ ఆనందం
- వాళ్లకి ఫోన్ చేయకపోతే నిద్రపట్టదు
- వాళ్లతో మాట్లాడితే మనశ్శాంతిగా ఉంటుంది
త్రివిక్రమ్ ద్వారా తెలుగు తెరకు అబ్బూరి రవి .. రచయితగా పరిచయమయ్యారు. ఆయన అందించిన ఎన్నో కథలు హిట్ చిత్రాలుగా ప్రేక్షకులను పలకరించాయి. సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత ఆయన తన సమయాన్ని ఫ్యామిలీతో గడపడానికే కేటాయిస్తుంటారు. అదే విషయాన్ని ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన దగ్గర ప్రస్తావించగా, తనదైన శైలిలో స్పందించారు.
"ఫ్యామిలీ అనేది లేకపోతే కష్టపడటంలో అర్థమే లేదు. నన్ను బయటికి వెళ్లనిచ్చి .. నేను వచ్చేంతవరకూ వెయిట్ చేసి .. ఇంట్లో ఎలాంటి సమస్య లేకుండా చూసేది ఫ్యామిలీనే. అలాంటివాళ్లతో ఉండకపోతే .. నేను లేనట్టే గదా. నేను వాళ్లను ఎక్కువగా బయటికి తీసుకెళ్లకపోవచ్చు .. కానీ వాళ్లతో ఉంటా. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాన్న వెయ్యి .. పదిహేను వందలు .. అలా పంపించేవారు. ఆ డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూనే .. ప్రతి రోజు సాయంత్రం ఎస్టీడీ బూత్ నుంచి అమ్మానాన్నలకు ఫోన్ చేసి మాట్లాడేవాడిని. వాళ్లతో మాట్లాడలేకపోతే నాకు ఆ రోజు రాత్రి నిద్రపట్టేది కాదు. వాళ్లతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా అనిపించేది" అని చెప్పుకొచ్చారు.