Narendra Modi: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మోదీ ఫోన్.. తుపాను బీభత్సంపై ఆరా!

  • తమిళనాడును వణికిస్తున్న ఓఖీ తుపాను
  • తుపాను నష్టంపై ఆరా తీసిన ప్రధాని
  • అన్ని విధాలా ఆదుకుంటామని హామీ

'ఓఖీ' తుపాను తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారిలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 30 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరో 24 గంటలపాటు కన్యాకుమారి ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఫోన్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తుపాను నష్టంపై ఆరా తీశారు. తుపానుతో అల్లకల్లోలంగా మారిన తమిళనాడును అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News