Narendra Modi: ఫోన్లో మాట్లాడుకున్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

  • జీఈ స‌ద‌స్సును పొగిడిన అధ్య‌క్షుడు
  • వెల్ల‌డించిన శ్వేత‌సౌధ వ‌ర్గాలు
  • స‌ద‌స్సు అద్భుత విజ‌య‌మ‌ని ప్ర‌క‌ట‌న‌

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో మూడు రోజుల పాటు జ‌రిగిన గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్ అద్భుత విజ‌యం సాధించింద‌ని వైట్‌హౌస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీని గురించి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ఫోన్లో మాట్లాడుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌ద‌స్సుకి ట్రంప్ కూతురు, అధ్య‌క్షుడి స‌ల‌హాదారు ఇవాంకా ట్రంప్‌ హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

ఇరు దేశాలు స‌మన్వ‌యంగా నిర్వ‌హించే ఈ ఎనిమిదో జీఈఎస్‌కి దాదాపు 1500 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు హాజ‌రు కాగా, 150 మందికి పైగా పెట్టుబ‌డిదారులు, పారిశ్రామిక వేత్త‌లు ప్ర‌సంగించారు. గ‌త జూన్‌లో మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌పుడు జీఈ స‌ద‌స్సుకి భార‌త్ రావాల‌ని ఇవాంకాను ఆహ్వానించారు. ఆయ‌న ఆహ్వానం మేర‌కు ఇవాంకా హాజ‌రై స‌ద‌స్సు విజ‌య‌వంతం చేసినట్లు వైట్‌హౌస్ త‌మ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

  • Loading...

More Telugu News