Virat Kohli: కోహ్లీ గ్రహాంతర వాసి.. ప్రపంచం స్పందన ఇదీ!

  • ఒక్క సెంచరీతో పలు రికార్డులను సొంతం చేసుకున్న కోహ్లీ
  • కామెంట్లతో మోతెక్కిపోతున్న ట్విట్టర్
  • ప్రశంసల వర్షం కురిపిస్తున్న ప్రపంచ క్రికెటర్లు

ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్‌లో సెంచరీ చేసి, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 52 శతకాలు అందుకున్న ఆటగాడిగా రికార్డు నమోదు చేసిన కోహ్లీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జడివాన కురుస్తోంది. ఈ టెస్టులో కోహ్లీ పలు రికార్డులను బద్దలుగొట్టాడు. టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడంతోపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 16 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గానూ రికార్డు సృష్టించాడు. అలాగే ఒకే కేలండర్ ఇయర్‌లో అత్యధిక  పరుగులు సాధించిన రాహుల్ ద్రవిడ్‌ రికార్డును కోహ్లీ అధిగమించాడు.

ఈ ఒక్క సెంచరీతో కోహ్లీ ఖాతాలో పలు రికార్డులు వచ్చి చేరాయి. వరుసగా మూడు టెస్టుల (సిరీస్‌లు)లోనూ సెంచరీలు చేసిన తొలి కెప్టెన్‌గా కోహ్లీ అవతరించాడు. అంతేకాదు, ఈ ఘనతను రెండుసార్లు అందుకోవడం మరో విశేషం. కోహ్లీ రికార్డుల మోతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు అయితే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కోహ్లీ మరో గ్రహం నుంచి వచ్చి భారత క్రికెట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

కోహ్లీపై పలువురు క్రికెటర్లు ఇలా స్పందించారు..

కెవిన్ పీటర్సన్: కోహ్లీ ఈతరంలోనే గొప్ప ఆటగాడు. ప్రస్తుతం ఉన్న బ్యాట్స్‌మెన్‌లతో పోలిస్తే కోహ్లీది మరో స్థాయి.
మైఖెల్ వాన్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు
అలెక్స్ ట్యుడర్: ఇంకో డబుల్ సెంచరీ కోసం చూస్తున్నా
మార్క్ బుచర్: నేనైతే ట్రిపుల్ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నా
వీవీఎస్ లక్ష్మణ్: కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు

  • Loading...

More Telugu News