airport: 200 బొద్దింకలను బ్యాగులో పెట్టుకుని విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడు!
- తన భార్య చర్మ వ్యాధి చికిత్స కోసం తీసుకెళ్తున్నానన్న ప్రయాణికుడు
- నిబంధనలకు విరుద్ధమన్న సిబ్బంది.. వాటిని అక్కడే వదిలి వెళ్లిన వైనం
- చైనాలోని గౌంగడోంగ్ బైయున్ విమానాశ్రయంలో ఘటన
చైనాలోని గౌంగడోంగ్ బైయున్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు ఓ బ్యాగులో 200 బొద్దింకలను తెచ్చి, విమానం ఎక్కాలనుకున్నాడు. అయితే, ప్రయాణికుల లగేజ్‌ను తనిఖీ చేస్తోన్న విమానాశ్రయ సిబ్బంది ఆ ప్రయాణికుడి బ్యాగులో బొద్దింకలను చూసి షాకయ్యారు.
వాటిని తీసుకెళ్లకూడదని అక్కడి సిబ్బంది చెప్పగా.. తన భార్య చర్మ వ్యాధితో బాధపడుతోందని, మెడికల్ క్రీమ్‌లో బొద్దింకలను ముంచి ఆమె చర్మానికి వాటిని రాయాలని సదరు ప్రయాణికుడు చెప్పాడు. వాటిని విమానంలోకి అనుమతించడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్పడంతో ఆ ప్రయాణికుడు వాటిని అక్కడే వదిలి విమానం ఎక్కి వెళ్లాడు. చైనా ప్రజలు బొద్దింకలను స్నాక్స్‌గా చేసుకుని కూడా తింటారు.