Jayalalitha: ఆ వేలిముద్రలు జయలలితవే!: విచారణ సంఘం ఎదుట వైద్యుడి సాక్ష్యం

  • బీఫాంలోని వేలిముద్రలు జయలలిత పెట్టినవే
  • ఆ సమయంలో జయ పక్కన శశికళ ఉన్నారు
  • విచారణ సంఘానికి తెలిపిన ప్రభుత్వ వైద్యుడు

అనారోగ్యంతో జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడులోని మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన అన్నాడీఎంకే అభ్యర్థుల బీ-ఫాంలపై ఆసుపత్రిలో ఉన్న జయలలిత వేలిముద్రలు పెట్టారు. ఆ వేలిముద్రలు జయలలిత పెట్టినవి కావని, సంతకం చేయగలిగిన స్థితిలో ఉన్న ఆమె వేలిముద్రలు ఎందుకు పెట్టారంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ వేలిముద్రలు ఆమెవేనని తాజాగా ప్రభుత్వ వైద్యుడు తెలిపారు.

జయలలిత మృతిపై మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అర్ముగస్వామి ఆధ్వర్వంలో ఏర్పాటైన విచారణ సంఘం ఎదుట హాజరైన ప్రభుత్వ వైద్యుడు బాలాజీ బీ-ఫాంలో ఉన్న వేలిముద్రలపై స్పష్టత ఇచ్చారు. బీ-ఫాంలపై వేలిముద్రలు వేయించడానికి అపోలో ఆసుపత్రిలో ఉన్న జయ వద్దకు తాను సాక్షిగా వెళ్లానని, ఆ సమయంలో జయ వద్ద శశికళ మాత్రమే ఉన్నారని బాలాజీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News