youtube: యూట్యూబ్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తోన్న టాప్-5 స్టార్లు.. వివరాలు!
- డేనియల్ మిడిల్టన్ (డాన్ టీడీఎం) ఆదాయం 16.5 మిలియన్ డాలర్లు (రూ.106 కోట్లు)
- ఇవన్ ఫాంగ్ ఆదాయం 15.5 మిలియన్ డాలర్లు
- డ్యూడ్ ఫెర్ఫెక్ట్ సంపాదన 14 మిలియన్ డాలర్లు
- యూట్యూబ్ స్టార్స్ లోగన్ పౌల్, మార్క్ ఫిక్బాక్ ల ఆదాయం 12 మిలియన్ డాలర్లకు పై మాటే
ఏవైనా వీడియోలను చూడాలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది యూ ట్యూబ్. ఆ యూ ట్యూబే ఇప్పుడు లక్షలాది మందికి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. యూ ట్యూబ్ వల్ల కోటీశ్వరులైపోయిన వారూ ఉన్నారు. గత ఏడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 1 మధ్య ఇలా అత్యధిక ఆదాయాన్ని సంపాదించిన వారి పేర్లు బయటకు వచ్చాయి.
అందులో బ్రిటన్కు చెందిన 26 ఏళ్ల మిడిల్టన్ నెంబర్ వన్ గా నిలిచాడు. తన యూట్యూబ్ చానల్ 'డాన్ టీడీఎం'లో వీడియో గేములు ఆడుతూ అందుకు సంబంధించిన వివరాలు చెబుతుంటాడు. అతడికి 17 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. డేనియల్ మిడిల్టన్ ఆదాయం 16.5 మిలియన్ డాలర్లు (రూ.106 కోట్లు)గా ఉంది. ఇక రెండో స్థానంలో ఇవన్ ఫాంగ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతడి ఆదాయం 15.5 మిలియన్ డాలర్లుగా ఉంది. యూ ట్యూబ్లో కామెడీ వీడియోలు, వీడియో గేమ్స్ పోస్ట్ చేస్తుంటాడు.
మూడో స్థానంలో స్పోర్ట్స్ ట్రిక్స్, కామెడీ వీడియోలు పోస్ట్ చేసే డ్యూడ్ ఫెర్ఫెక్ట్ ఉన్నాడు. అతడి ఆదాయం 14 మిలియన్ డాలర్లుగా ఉంది. నాలుగో స్థానంలో కామిక్ వీడియోలు అప్లోడ్ చేసే లోగన్ పౌల్ ఉన్నాడు. ఆదాయం 12.5 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఐదో స్థానంలో మ్యూజిక్, గేమ్స్ అప్లోడ్ చేసే మార్క్ ఫిక్బాక్ ఉన్నాడు. అతడి ఆదాయం 12.5 మిలియన్ డాలర్లు.