charan: నిజ జీవితంలో నుంచి కథను తీసుకున్న రాజమౌళి?
- రాజమౌళి తదుపరి చిత్రంగా మల్టీ స్టారర్
- ముందుగా ఎన్టీఆర్ తో షూటింగ్
- ఆ తరువాత చరణ్ సీన్స్ చిత్రీకరణ
- చివరిలో కాంబినేషన్ సీన్స్
ఎన్టీఆర్ .. చరణ్ కాంబినేషన్లో రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించనున్నాడనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ముందుగా ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన సన్నివేశాలు .. ఆ తరువాత చరణ్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలను చివరిలో తెరకెక్కిస్తారని అంటున్నారు.
ఫ్యామిలీ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా కోసం, ఇద్దరి పాత్రలను సమతూకంగా రాజమౌళి మలుస్తున్నాడని చెబుతున్నారు. అయితే విశేషం ఏమిటంటే .. యథార్థ జీవితంలో నుంచి రాజమౌళి ఈ కథను తీసుకున్నాడట. రియల్ లైఫ్ లో ఒక ఫ్యామిలీని చూసి ఇన్ స్పైర్ అయిన ఆయన, ఈ కథను అల్లుకున్నాడని చెబుతున్నారు. రాజమౌళికి స్ఫూర్తిని కలిగించి .. ఆయన కథను సిద్ధం చేసుకునేలా చేసిన ఆ ఫ్యామిలీ ఎవరిదనే విషయంపైనే ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.