indian: భారతీయుడిపై దాడిని అడ్డుకున్న అమెరికన్‌కి టైమ్ మేగజైన్ గౌరవం
- జాతి వివక్ష దాడిలో గాయపడ్డ ఇయాన్ గ్రిలాట్
- కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాపాడే ప్రయత్నంలో బుల్లెట్ గాయం
- చనిపోయిన శ్రీనివాస్
ఫిబ్రవరిలో అమెరికాలోని కేన్సస్‌లో జరిగిన జాతి విద్వేష దాడిలో భారతీయుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాపాడే ప్రయత్నంలో గాయపడ్డ అమెరికన్ ఇయాన్ గ్రిలాట్‌ను ప్రముఖ టైమ్ మేగజైన్ గౌరవించింది. ‘2017లో ప్రపంచంపై విశ్వాసం కలిగించిన ఐదుగురు హీరోల’ జాబితాలో గ్రిలాట్ పేరును టైమ్ చేర్చింది.
ఓలెత్‌లోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్‌లో కూచిభొట్ల శ్రీనివాస్, మాదసాని అలోక్‌పై ఆడమ్ ప్యూరింటన్ అనే అమెరికన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతిచెందగా అలోక్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే..ఆడమ్ ప్యూరింటన్‌ని అడ్డుకునే ప్రయత్నంలో ఇయాన్ గ్రిలాట్‌కి బుల్లెట్ తగిలింది. ఆ తూటా ఇయాన్ ఛాతిలోకి దూసుకెళ్లింది. దాడి అనంతరం ఇయాన్‌ను ఆసుపత్రిలో చేర్చగా.. కొన్నాళ్ల తర్వాత కోలుకున్నాడు.
ఆ ఘటనతో ఇయాన్ కేన్సస్ హీరోగా అందరి మన్ననలు పొందాడు. ఇటీవలే హ్యూస్టన్‌లోని ఓ భారత- అమెరికన్ కమ్యూనిటీ అతడిని ‘నిజమైన అమెరికా హీరో’గా అభివర్ణించింది. ఇయాన్ కోసం లక్ష డాలర్ల నిధులు సేకరించి ఇచ్చింది.