chidambaram: ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీ ఎంతకైనా తెగిస్తుందా?: చిదంబరం ట్వీట్
- మోదీ చేస్తోన్న వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ నేత చిదంబరం
- పాక్ హైకమిషనర్‌తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారని అంటున్నారు
- మాజీ ప్రధాని, మాజీ ఉప రాష్ట్రపతిలపై కూడా ఆరోపణలు చేస్తున్నారు
- ఇంత దిగజారుతారా?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేనథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతోన్న విషయం తెలిసిందే. తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రధానమంత్రి మోదీ చేస్తోన్న వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. పాకిస్థాన్ హైకమిషనర్‌తో మణిశంకర్ అయ్యర్, సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ రహస్యంగా సమావేశం అయ్యారని ప్రధాని మోదీ అన్నారని తెలిపారు.
రెండు రోజులుగా బీజేపీ మరింత దిగజారి వ్యాఖ్యలు చేస్తోందని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై కూడా ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీల గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు.