vijay: హాస్యనటుడు విజయ్ ఆత్మహత్య కేసులో భార్య వనితపై కేసు నమోదు
- విజయ్ తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు భార్య వనితపై కేసు
- న్యాయవాది శ్రీనివాస్, శశిధర్‌పై కూడా జూబ్లిహిల్స్ పీఎస్ లో కేసు నమోదు
- వనిత డబ్బు కూడా డిమాండ్ చేసేది: విజయ్ తండ్రి
హాస్యనటుడు విజయ్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో విజయ్ తండ్రి సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు విజయ్ భార్య వనితపై కేసు నమోదు చేశారు. అలాగే న్యాయవాది శ్రీనివాస్, శశిధర్‌పై కూడా కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ... విజయ్‌తో విడిపోయిన వనిత తన కుమారుడిని తరుచూ డబ్బు డిమాండ్ చేసేదని తెలిపారు. వనిత తరపు అడ్వకేట్ శ్రీనివాస్ పలుసార్లు ఈ విషయమై ఇంటికి వచ్చేవాడని తెలిపారు. పోలీసుల వద్ద ఉన్న సెల్ఫీ వీడియో ఆధారంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విజయ్ కు నటన అంటే ప్రాణం అని, అందుకే తాము ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వచ్చామని తెలిపారు.