short film: షార్ట్ ఫిలిం కోసమే దళితులను కొట్టానని భరత్‌రెడ్డి అసత్యం చెప్పాడు: స్పష్టం చేసిన పోలీసులు
- నెల రోజుల క్రితం దళిత యువకులపై దాడి
- దాడి చేసిన భరత్ రెడ్డి కట్టుకథ అల్లాడు
- దొరల రాజ్యం షార్ట్ ఫిలిమ్ తీస్తున్నామని చెప్పాడు
- భరత్‌రెడ్డిని అరెస్టు చేశాం.. కోర్టులో ప్రవేశపెడతాం
బీజేపీ బహిష్కృత నేత భరత్ రెడ్డి నెల రోజుల క్రితం ఇద్దరు దళిత యువకులను కొట్టి, బురదనీటిలో ముంచిన విషయం తెలిసిందే. అయితే, తాము దొరల రాజ్యం అనే షార్ట్ ఫిలిమ్ కోసం అలా నటించామని భరత్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ కేసులో దర్యాప్తు చేస్తోన్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. వీడియో సాక్ష్యంతో దొరికిపోవడంతోనే దళిత యువకులతో భరత్‌రెడ్డి అలా అసత్యాలు చెప్పించాడని పోలీసులు చెప్పారు.
దొరల రాజ్యం షార్ట్ ఫిలిమ్ తీస్తున్నామని ఒక కట్టుకథ అల్లి చెప్పాడని అన్నారు. మొరం తరలిస్తున్నందుకే దళితులు లక్ష్మణ్, రాజేశ్వర్లను భరత్ రెడ్డి కొట్టాడని అన్నారు. ఈ ఘటన తరువాత ఆ దళిత యువకులను భరత్ రెడ్డి తన వెంట పెట్టుకుని పలు ప్రాంతాల్లో తిప్పుతూ ఉన్నాడని స్పష్టం చేశారు. భరత్ రెడ్డిని న్యాయస్థానంలో ప్రవేశ పెడతామని తెలిపారు.