Cricket: క్రికెట్ అభిమానులకు శుభవార్త .. భారత్ లో తొలిసారిగా పూర్తిస్థాయి ప్రపంచకప్!
- 2023లో వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్‌కప్ భారత్‌లోనే
- 2021 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా భారత్‌లో
- ప్రకటించిన బీసీసీఐ
భారత్ తొలిసారి పూర్తిస్థాయి ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వనుంది. బీసీసీఐ ఈ రోజు ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలిపింది. 2023లో వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్‌కప్‌కు భారత్‌లోనే నిర్వహించనున్నట్లు, అలాగే 2021 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్‌లో నిర్వహించనున్నట్లు చెప్పింది.
గతంలో పలుసార్లు భారత్‌లో క్రికెట్ వరల్డ్ కప్ లు జరిగాయి. అయితే, ఆయా మ్యాచ్‌లకు భారత్ పూర్తి స్థాయి ఆతిథ్యం ఇవ్వలేదు. ఇతర దేశాలతో కలిసి ఆ వరల్డ్‌కప్‌లు జరిగాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారత్‌లో క్రికెట్ అభిమానులు ఉన్నారు. భారత్‌లో పూర్తిస్థాయి వరల్డ్‌కప్ జరగనుండడం భారత క్రికెట్ అభిమానులకు శుభవార్తే.