unicef: ఇంట‌ర్నెట్ వాడుతున్న ప్ర‌తి ముగ్గురిలో ఒకరు మైన‌ర్: యునిసెఫ్‌

  • మూడో వంతు యువ‌త‌కు ఇంట‌ర్నెట్ అందుబాటులో లేదు
  • దేశంలో ఇంట‌ర్నెట్ వాడుతున్న మ‌హిళ‌లు 29 శాతం మాత్ర‌మే
  • స్టేట్ ఆఫ్ వ‌ర‌ల్డ్స్ చిల్డ్ర‌న్ 2017 నివేదిక‌లో వెల్ల‌డి

సాంకేతిక అభివృద్ధి ప్ర‌భావం పిల్ల‌ల‌పై ఎలా పడుతుంద‌నే అంశానికి సంబంధించిన అధ్య‌య‌నంలో భాగంగా 'స్టేట్ ఆఫ్ వ‌ర‌ల్డ్స్ చిల్డ్ర‌న్ 2017: చిల్డ్ర‌న్ ఇన్ డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌' పేరుతో యునిసెఫ్ నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఈ నివేదిక ప్ర‌కారం ఇంట‌ర్నెట్ వాడుతున్న ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు మైన‌ర్ అని తేలింది. అలాగే భార‌త‌దేశంలో కేవలం 29శాతం మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న‌ట్లు తెలిపింది.

అంత‌ర్జాతీయంగా మూడో వంతు యువ‌త‌కు అంటే 346 మిలియ‌న్ల మందికి ఇంట‌ర్నెట్ అందుబాటులో లేద‌ని వెల్ల‌డించింది. ఇంట‌ర్నెట్ అందుబాటులో లేని వారు డిజిట‌ల్ ప్ర‌పంచంలో వెన‌క‌బ‌డి పోతుంటే, అందుబాటులో ఉన్న‌వారు మాత్రం దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. ఇక 2017లో ప్రపంచవ్యాప్తంగా మహిళలతో పోలిస్తే 12శాతం ఎక్కువ మంది పురుషులు ఇంటర్నెట్‌ను వినియోగించారని ఈ నివేదికలో పేర్కొంది.

  • Loading...

More Telugu News