India: భారత్‌పై మరోసారి విషం కక్కిన చైనా!
- భారత్ తీరు బాగోలేదు
- భారత భద్రతా బలగాలు సరిహద్దు దాటి రావడం వల్లే విభేదాలు
- డోక్లాం ప్రతిష్టంభనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలహీనం
- మరోసారి ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి
భారత్‌పై చైనా మరోసారి విషం కక్కింది. భారత భద్రతా బలగాలు సరిహద్దు దాటి తమ భూభాగంలోకి ప్రవేశించడం వల్లే డోక్లాం ప్రతిష్టంభన వంటి వివాదాలు చోటుచేసుకున్నాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలహీనపడిందని తెలిపింది. చివరకు దౌత్యపరమైన చర్చలతో సమస్య పరిష్కారమైందని పేర్కొంది.
ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాలని, మరోసారి ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని హితవు పలికింది. రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు నిన్న భారత్‌లో భేటీ అయ్యారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ తిరిగి చైనాకు వెళ్లిపోగానే ఆ దేశం ఇటువంటి ప్రకటన చేసి తమ బుద్ధిని చూపింది. దాదాపు 75 రోజుల క్రితం ముగిసిన డోక్లాం విషయాన్ని ఉటంకిస్తూ తమ తప్పేలేదన్నట్లు చైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.