bullet train: జపాన్ లో బుల్లెట్ ట్రైన్ కు ప్రమాదం.. భారత్ లో పరుగులు పెట్టనున్న రైలు కూడా ఇదే!
- బుల్లెట్ ట్రైన్ లో పొగలు, మంటలు
- రైలును ఆపేసిన అధికారులు
- ప్రమాదం సమయంలో రైల్లో వెయ్యి మంది ప్రయాణికులు
జపాన్ లో బుల్లెట్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. బుల్లెట్ ట్రైన్ లో పొగలు, మంటలు వచ్చాయి. షింకాన్ షెన్ సంస్థ ఈ బుల్లెట్ ట్రైన్ లను నిర్మిస్తోంది. భారత్ లో చేపట్టనున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కూడా ఈ సంస్థ రైళ్లే పరుగులు తీయనున్నాయి. పట్టాలు బీటలు వారడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణహాని సంభవించకపోయినప్పటికీ... దీన్ని ఓ భారీ ప్రమాదంగానే నిపుణులు చెబుతున్నారు.
దక్షిణ జపాన్ లోని నాగయ స్టేషన్ వద్ద ట్రైన్ లో పొగలు వచ్చాయి. దీంతోపాటు విచిత్రమైన శబ్దాలు రావడం కూడా ప్రారంభమైంది. దీంతో, రైలును అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ట్రైన్ మరికొంత దూరం ప్రయాణించి ఉంటే పరిస్థితులు దారుణంగా ఉండేవని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని తాము సీరియస్ గా తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా రైల్లో ఉన్న దాదాపు వెయ్యి మంది ప్రయాణికులను మరో బుల్లెట్ ట్రైన్ లో తరలించారు.