janasena: వివాదంలో జనసేన పార్టీ కార్యాలయ స్థలం!
- చినకాకానిలో మూడు ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకున్న జనసేన
- యార్లగడ్డ సాంబ శివరావు నుంచి మూడేళ్లకు లీజు
- ఆ స్థలం తమదంటూ వచ్చిన షేక్ షఫి
- జనసేన కార్యాలయ నిర్మాణం జరపకూడదంటూ డిమాండ్
ఏపీ రాజధాని సమీపంలో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం జనసేన పార్టీ లీజుకు తీసుకున్న స్థలం వివాదంలో పడింది. మంగళగిరిలోని చినకాకానిలో యార్లగడ్డ సాంబ శివరావు నుంచి జనసేన మూడు ఎకరాల స్థలాన్ని మూడు ఏళ్లకు లీజుకు తీసుకుంది. అయితే, ఆ స్థలం తమదంటూ షేక్ షఫి అనే వ్యక్తి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తమదైన ఆ భూమి వివాదంలో ఉందని వివరించారు. అటువంటి భూమిని లీజుకు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఆ స్థలంలో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టకూడదని షేక్ షఫి డిమాండ్ చేస్తున్నారు.