Supreme Court: క్రిమినల్ కేసులు ఉన్న ప్రజా ప్రతినిధులకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
- మార్చి నుంచి ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణ
- రెండు నెలల్లో ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల వివరాల నివేదిక ఇవ్వాలి
- ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి
- వాటి ఏర్పాటుకు రూ.7.8 కోట్లు విడుదల చేయాలి
క్రిమినల్ కేసులు ఉన్న ప్రజా ప్రతినిధులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణ ప్రారంభం కావాలని ఆదేశించింది. రెండు నెలల్లో ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల వివరాల నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు చెప్పింది.
అలాగే ఈ కేసుల కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని, వాటి ఏర్పాటుకు రూ.7.8 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, కేంద్ర సర్కారు కేటాయించిన నిధులను హైకోర్టుల సూచనల మేరకు వినియోగించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని తెలిపింది.