noodle: ప్ర‌పంచంలో అతిపొడ‌వైన న్యూడిల్... 10,100 అడుగుల పొడ‌వు... వీడియో ఇదిగో!

  • గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన న్యూడిల్‌
  • పూర్తిగా చేతితోనే త‌యారీ
  • బ‌రువు 66 కిలోగ్రాములు

ప్ర‌పంచంలో అత్యంత పొడ‌వైన న్యూడిల్‌ని త‌యారు‌చేసిన చైనాకు చెందిన ఓ ఫుడ్ కంపెనీ గిన్నిస్ రికార్డు సృష్టించింది. 10,100 అడుగులు ఉన్న ఈ న్యూడిల్‌ను పూర్తిగా చేతితోనే త‌యారుచేయ‌డం విశేషం. 40 కిలోల బ్రెడ్‌ పిండి, 26.8 లీట‌ర్ల నీళ్లు, 0.6 కిలోల ఉప్పు ఉప‌యోగించి ఈ న్యూడిల్‌ను త‌యారుచేశారు. దీని బ‌రువు 66 కిలోగ్రాముల కంటే ఎక్కువగా ఉంది.

దీని త‌యారీకి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోలో పిండి ద‌శ నుంచి పూర్తిగా వండిన‌ ద‌శ వ‌ర‌కు న్యూడిల్ త‌యారీని చూడొచ్చు. చేతుల‌తో రుద్దుతూ ఈ న్యూడిల్‌ను త‌యారు చేయ‌డానికి దాదాపు 17 గం.లు ప‌ట్టింది. ఇక త‌యారీ పూర్త‌యిన త‌ర్వాత దాని పొడ‌వును లెక్క వేయ‌డానికి గిన్నిస్ అధికారి జాన్ గార్లండ్‌కి 3 గం.లు ప‌ట్టింది. 2001లో జ‌పాన్‌లో త‌యారుచేసిన 1800 అడుగుల పొడ‌వైన న్యూడిల్ రికార్డును ఈ చైనా కంపెనీ త‌యారుచేసిన న్యూడిల్ బ‌ద్ద‌లు కొట్టింద‌ని జాన్ ప్ర‌క‌టించారు.

న్యూడిల్ పూర్తిగా త‌యారైన త‌ర్వాత కోడిగుడ్డు, ట‌మాట‌, వెల్లుల్లితో చేసిన సాస్‌ల‌తో క‌లిపి ఆ కంపెనీలోని 600 మంది ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేశారు. చైనా సంప్ర‌దాయం ప్ర‌కారం 'సీనియ‌ర్స్ డే' రోజున న్యూడిల్ పొడవును పెద్ద‌వారి ఆయుష్షుతో పోలుస్తారు. అది ఎంత పొడుగ్గా ఉంటే అంత‌కాలం వారి ఆయుష్షు పెరుగుతుంద‌ని వారు న‌మ్ముతారు.

  • Loading...

More Telugu News