roja: అందుకే నేను రోజాను అలా అన్నాను: బ‌ండ్ల గ‌ణేశ్

  • నేను మ‌హిళ‌ల‌ను ఎప్పుడూ ఏ మాటా అన‌లేదు
  • రోజా న‌న్ను రెచ్చ‌గొట్టారు.. నేను స‌మాధానం చెప్పాను
  • ప‌వ‌న్ క‌ల్యాణ్ నాకు దైవంతో స‌మానం
  • ప‌వ‌న్‌ను వాడు, వీడు అని రోజా అన్నారు

'నేను మ‌హిళ‌ల‌ను ఎప్పుడూ ఏ మాటా అన‌లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని వాడు, వీడు అని ఎమ్మెల్యే రోజా అన్న‌ది కాబ‌ట్టి నేను ఆమెను అలా అన్నాను. నేను ఏ ప్రాంతం వాడిన‌యినా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానిని. ఆయ‌న‌ను ఏమ‌న్నా అంటే నాకు కోపం రాదా? అని  సినీన‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేశ్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై బండ్ల గ‌ణేశ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆయ‌న‌ను అరెస్టు చేయాల‌ని వైసీపీ మ‌హిళా నేత‌లు డిమాండ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో మీడియాతో బండ్ల గ‌ణేశ్ మాట్లాడుతూ... 'నాకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ దైవ స‌మానం, ఆయ‌నేంటో ఆయ‌న క్యారెక్ట‌ర్ ఏంటో నాకు తెలుసు. ఎందుకమ్మా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని వాడు, వీడు అంటున్నావ‌ని రోజాను అడిగాను.. దీంతో రోజా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.. ఆమె అన్నాకే నేను కూడా రోజాని అలా అన్నాను. వైసీపీలో ఇంత‌మంది మ‌హిళా నేత‌లు ఉన్నారు ఎవ‌రయినా రోజాలా చెడుగా మాట్లాడుతున్నారా? వాసిరెడ్డి ప‌ద్మగారూ ఎంతో బాగా మాట్లాడ‌తారు. రోజా మాట్లాడే మాట‌ల వ‌ల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే న‌ష్ట‌పోతోంది. రోజా న‌న్ను రెచ్చ‌గొడితేనే అలా అన్నాను' అని అన్నారు.

  • Loading...

More Telugu News