telugu: సోదర, సోదరీమణులారా అంటూ.. తెలుగులో ప్రసంగించి అలరించిన అసదుద్దీన్ ఒవైసీ!
- ప్రపంచ తెలుగు మహాసభలో హైదరాబాద్ ఎంపీ
- మన హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం
- తెలుగు భాషాభివృద్ధికి మన ముఖ్యమంత్రి చాలా కృషి చేస్తున్నారు
- హైదరాబాద్లో హిందూ, ముస్లింలు పాలు, నీళ్లలా కలిసిమెలసి జీవిస్తున్నారు
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ప్రపంచ తెలుగు మహాసభలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలుగులో మాట్లాడి అందర్నీ అలరించారు. "గౌరవనీయులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి, గవర్నర్ నరసింహన్ గారికి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ గారికి, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సభకు విచ్చేసిన సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక అభినందనలు. ప్రపంచ తెలుగు మహాసభలు మన హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం.
తెలుగు భాషాభివృద్ధికి మన ముఖ్యమంత్రి చాలా కృషి చేస్తున్నారు. ఈ హైదరాబాద్లో కుతుబ్ షా కాలం నుంచి హిందూ, ముస్లింలు పాలు, నీళ్లలా కలిసిమెలసి జీవిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం హిందూ, ముస్లింల ఐకమత్యానికి ఉదాహరణగా నిలుస్తోంది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది" అని అన్నారు.