hey google: వాయిస్ అసిస్టెన్స్లో స్వల్ప మార్పు చేసిన గూగుల్!
- 'ఓకే గూగుల్' కాదు.. ఇక నుంచి 'హే గూగుల్'
- పదం పాతది అయ్యిందని గూగుల్ యోచన
- ప్రయోగాత్మకంగా కొన్ని స్మార్ట్ఫోన్లలో అమలు
ఇటీవల గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సదుపాయాన్ని ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ వాయిస్ అసిస్టెన్స్ సేవలు అమలు చేసినట్లైంది. ఈ నేపథ్యంలో వాయిస్ అసిస్టెన్స్లో స్వల్ప మార్పు చేసేందుకు గూగుల్ యోచిస్తోంది.
ఈ మార్పులో భాగంగా ఇప్పటివరకు ఉన్న గూగుల్ యాక్టివేటింగ్ వాయిస్ కమాండ్ 'Ok Google'ను మార్చనుంది. దీన్ని 'Hey Google' అని మార్చబోతున్నట్లు సమాచారం. ఓకే గూగుల్ అనే పదం చాలా పాతది అయినందున దాని స్థానంలో కొత్త పదం ఉంటే బాగుంటుందని గూగుల్ ఆలోచించింది. ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ మార్పును ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆపిల్ వారు ఉపయోగించే Hey Siri అనే పదాన్ని పోలి ఉండటం గమనార్హం.